హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయాలన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. సెలబ్రెటీ కొడుకైనా హంగూ ఆర్భాటాలు లేకుండా సాధారణ వ్యక్తిలాగా స్వామివారిని దర్శించుకున్నారు.