సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని బ్రాహ్మణ బస్తీలో డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ బుధవారం పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వాటర్ పొల్యూషన్ సమస్యలు ఉన్నాయని తెలుపగా. వెంటనే సమస్యలను పరిష్కరించాలని జలమండలి మేనేజర్ ప్రియాంకను కార్పొరేటర్ ఆదేశించారు. త్వరలో రోడ్డు పనులను కూడా చేపడతామని హామీ ఇచ్చారు. దశలవారిగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.