నివేదిక పత్రాలను సీల్డ్ కవర్‌లో సీఎంకి అందచేత

77చూసినవారు
నివేదిక పత్రాలను సీల్డ్ కవర్‌లో సీఎంకి అందచేత
జీవో 317 పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వేగం పెంచింది. కమిటీ రూపొందించిన నివేదిక పత్రాలను సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అందజేసింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సభ్యులు, మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, పలువురు మేధావులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల అభిప్రాయాలను వినతుల రూపంలో ప్రత్యక్షంగా, వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను కేబినెట్ సబ్ కమిటీ స్వీకరించింది.

సంబంధిత పోస్ట్