హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనిష్టం రూ.10 నుంచి రూ.12కు, గరిష్టం రూ.60 నుంచి 75కు పెంచారు. మొదటి 2 స్టాపుల వరకు రూ.12; 2 నుంచి 4 స్టాపుల వరకు రూ.18; 4 నుంచి 6 స్టాపుల వరకు రూ.30; గరిష్ఠంగా రూ.60 నుంచి రూ.75కి పెంచుతున్నట్లు మెట్రో సంస్థ ఎల్ అండ్ టీ పేర్కొంది. వ్యయం పెరగడం వల్లనే ఛార్జీలు పెంచామని ప్రకటించింది. దీంతో ప్రయాణికులపై భారం పడనుంది. కొత్త చార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి.