కుర్మగూడలోని బంగారు మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మహోత్సవంలో ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.