అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపం గుడిమల్కాపూర్ వెజిటబుల్ మార్కెట్ పరిసరాలు. చాలాకాలంగా విజిటెబుల్ మార్కెట్ బయట దారి పొడవున చెత్త పేరుకుపోయింది. కూరగాయల వ్యర్థాలతో పాటు ఇతర వ్యర్థాలు కూడా అక్కడే పడేయడంతో చెత్త పేరుకుపోయింది. అయిన సిబ్బంది మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మార్కెట్లోకి వెళ్ళాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.