బోడుప్పల్ నారాయణ పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శనివారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీయం గోపాల్ రెడ్డి, ఏజీయం బాల పరమేశ్వర్ రావు, ప్రధానోపాధ్యాయులు విచ్చేసి భోగి మంటతో జ్యోతి ప్రజ్వలన చేసి పండుగ సంబరాలను ప్రారంభించారు. పాఠశాల దశనుండే విద్యార్థులు మన సంస్కృతీ సాంప్రదాయాలను తెలుసుకొని వాటిని కాపాడుకోవాలని విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు.