
అమెరికా నుంచి డబ్బు పంపుతున్నారా.. ఇకపై ట్యాక్స్ కట్టాల్సిందే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు కుంపటిగా మారారు. ఇప్పుడు అమెరికాలోని ప్రవాసీయులు తమ స్వదేశాలకు పంపే నగదు బదిలీలపై 5 శాతం పన్ను విధించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన బిల్లు త్వరలోనే ప్రతినిధుల సభ ముందుకు రానుంది. ఒకవేళ ఇది అమలులోకి వచ్చినట్లయితే హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డు దారులు సహా లక్షలాది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది.