ప్రస్తుత తెలంగాణ DGP జితేందర్ ఈ ఏడాది SEPలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త పోలీస్ బాస్ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం 30ఏళ్ల సర్వీసు పూర్తయిన ఏడుగురి పేర్లను పరిశీలిస్తోంది. వారిలో రవిగుప్తా, సీవీ ఆనంద్, శివధర్రెడ్డి, సౌమ్యామిశ్రా, షికాగోయల్ ముందువరుసలో ఉన్నారు. ఆ పేర్ల నుంచి ముగ్గురిని UPSC ఎంపిక చేయనుండగా, అందులో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది.