యాకుత్ పురా: తలాబ్ కట్టాలో అధ్వాన పరిస్థితి

80చూసినవారు
తలాబ్ కట్ట డివిజన్ పరిధిలోని రంగేలి కేడ్కిలో అధ్వాన పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు పనులు చేపట్టారు. పనుల్లో భాగంగా రోడ్డును తవ్వడంతో డ్రైనేజీ పైపు లైన్ పగిలింది. దీంతో రోడ్డుపై మురుగునీరు పారుతుండడంతో దుర్వాసన వచ్చి ఇబ్బందులు పడుతున్నామని స్థానిక నివాసితులు వాపోయారు. ఆయా ప్రాంతాలను గురువారం మజ్లీస్ బచావో తారిఖ్ పార్టీ చీఫ్ అంజాద్ ఉల్లా ఖాన్ పరిశీలించారు. వెంటనే అధికారులు చొరవ చూపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్