యాకుత్ పురా: తలాబ్ చంచలం డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే

79చూసినవారు
అభివృద్ది పనులు సకాలంలో పూర్తి అయ్యేలా చూస్తున్నామని యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ అన్నారు. శనివారం తలాబ్ చంచలం డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే పర్యటించారు. ఖానా నగర్లో కొనసాగుతున్న సీవరేజి లైన్ పనులను పరిశీలించారు. రూ. 87 లక్షలతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సమీన, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్