వర్షాకాలంలో నాలా పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాకుతుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ సూచించారు. గురువారం మదీనానగర్లోని నాలా ప్రాంతంలో పర్యటించారు. రాత్రి కురిసిన వర్షానికే నాలా పొంగి ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయని చెప్పారు. ఎవరికీ ప్రమాదం జరగలేదని ఎమ్మెల్యే వెల్లడించారు. మరోసారి వర్షం పడితే మురుగునీరు బయటకు రాకుండా నాలాలను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.