తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
తెలంగాణ రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు.. మరో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. స్మిత సబర్వాల్‌ను పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసుల కార్యదర్శిగా నియమించడంతో పాటు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కల్పించారు.