కనుమరుగవుతున్న చెరువులను పరిరక్షించేందుకు 'హైడ్రా' పేరిట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిదేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయితే ప్రభుత్వం అందరినీ సమదృష్టితో చూడాలని సూచించారు. ఆక్రమణల కూల్చివేతలతో నష్టపోయిన పేదలను ఆదుకోవాలని చెప్పారు. దేశం బాగుండటం అంటే మనుషులతో పాటు నదులు, చెరువులు, అడవులు, పశుపక్షాదులు బాగుండాలని వెంకయ్య ఆకాంక్షించారు.