TG: 450 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరాన్ని కాపాడుకునేందుకు హైడ్రా ఉపయోగపడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, హైడ్రా అంటే.. ప్రభుత్వ, ప్రజల ఆస్తులు రక్షించేదని సీఎం అన్నారు. బుద్ధభవన్‌లో ఏర్పాటైన హైడ్రా పీఎస్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. ఓల్డ్ సిటీ అంటే.. ఒరిజినల్ సిటీ అని భావించి అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు.