HYD: అల్వాల్ సర్కిల్‌లోని ఓల్డ్ అల్వాల్ గ్రామపంచాయతీలోని 60, 61, 62, 63 సర్వే నంబర్లలోని రెడ్డి ఎన్‌క్లేవ్‌లో పార్కుని హైడ్రా కాపాడింది. 16 ఎకరాలకు పైగా ఉన్న ఈ లే ఔట్‌లో 235 వరకూ ప్లాట్లున్నాయి. 30 ఏళ్ల క్రితం లేఔట్ వేసిన వారి వారసులే ఈ పార్కును కబ్జా చేసినట్టు అక్కడి నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు.. 2640 గజాల స్థలం పార్కుకు కేటాయించినదే అని నిర్ధారించి కబ్జాలను తొలగించారు.