తమిళనాడు కోయంబత్తూరులోని కుమరగురు టెక్నాలజీ కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థుల బృందం హైడ్రోజన్‌తో నడిచే వినూత్న వాహనాన్ని రూపొందించింది. బృందంలోని ప్రతీష్ మాట్లాడుతూ.. ‘రీసైకిల్ పీవీసీ వ్యర్థాలు, టిష్యూ పేపర్లతో తయారు చేసిన పదార్థాలను వినియోగించడంతో వాహనం తేలికగా ఉంది. కిలో హైడ్రోజన్‌తో 272 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. 1 కి.మీ. దూరానికి 50 పైసలు ఖర్చవుతుంది. గంటకు 35 కి.మీ.ల వేగంతో నడుస్తుంది’ అని చెప్పాడు.