AP: కాళ్లు, చేతులు ఆడినంత వరకు సమాజం కోసం పని చేస్తానని ఉద్యోగవిరమణ చేసిన సందర్భంలో చెప్పానని, ఆ మాటకు కట్టుబడి రాజకీయాల్లోకి వస్తున్నానని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. అమలాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "ప్రజల మెరుగైన భవిష్యత్ కోసం ప్రయత్నిస్తా. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నావంతు కృషిచేస్తా. ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేను." అని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.