BRSపై స్టేషన్ ఘన్‌పూర్ MLA కడియం శ్రీహరి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై BRSకు మాట్లాడే అర్హత లేదన్నారు. MLAల అనర్హత పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని.. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పు ఎలా వచ్చినా శిరసావహిస్తానని వ్యాఖ్యానించారు. ఎవరైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందేనన్నారు. ఒకవేళ ఉపఎన్నిక వస్తే తాను పారిపోనని.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.