TG: జనగామ ప్రజల ఆశీర్వాదంతో కోలుకుంటున్నానని BRS MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న ప్రమాదవశాత్తూ బాత్ రూమ్ లో కాలు జారీ పడ్డానని చెప్పారు. 'నాలుగు గంటలు మేజర్ ఆపరేషన్ అయ్యింది. నన్ను కలిసేందుకు చాలా మంది వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్లు రెండు వారాలు విశ్రాంతి అవసరం అని చెప్పారు. దయజేసి నన్ను కలిసేందుకు ఎవరు రావొద్దు. ఒక్క వారం రోజులు ఓపిక పట్టండి' అని చెప్పారు.