మంత్రి పదవి విషయంలో నాకు అసంతృప్తి ఉంది: జీవన్ రెడ్డి

80చూసినవారు
మంత్రి పదవి విషయంలో తనకూ అసంతృప్తి ఉందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లో వి.హనుమంతరావు తర్వాత తానే సీనియర్ నేత అని చెప్పారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదన్నారు. తాను పార్టీ మారతాను అంటున్నారు.. తన లాంటి వాన్ని పట్టుకొని పార్టీ మారుతానని ఎలా అంటున్నారు అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్