తన కుమారుడి టాలెంట్‌ను చూసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యాడు. జులైలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హిమాన్షు ‘నా సూర్యుడివి.. నా చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే, నాన్నా’ పాటను స్వయంగా పాడి తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ పాటపై కేటీఆర్ స్పందిస్తూ ‘ఈ కష్టతరమైన సంవత్సరంలో ఇది నాకు ఉత్తమ బహుమతి. తండ్రిగా ఎంతో గర్వపడుతున్నాను’ అని భావోద్వేగంతో ట్వీట్ చేశారు.