సంగారెడ్డి జిల్లా నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు, రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన MLA సునీత, BRS సీనియర్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. 'రాష్ట్రంలో అప్రకటి ఎమర్జెన్సీని తలపిస్తున్నది. సీఎం రేవంత్.. మీ పాలనలో ప్రజలు, ప్రజా ప్రతినిధులకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు లేదా?' అని ప్రశ్నించారు.