గద్దర్‌ని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించడాన్ని ఖండిస్తున్నా: కవిత

57చూసినవారు
గద్దర్‌ని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించడాన్ని ఖండిస్తున్నా: కవిత
TG: ప్రజా గాయకుడు గద్దర్‌ని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తుందని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు BRS MLC కవిత పేర్కొన్నారు. ప్రతి సందర్భంలో గద్దర్ పేరును జపం చేసే కాంగ్రెస్ సర్కార్.. వారి పేరు మీద ఇస్తున్నటువంటి సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫోటో లేకపోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా వారి చిత్రపటాన్ని పెట్టి వారిని గౌరవించాలని కోరుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్