మాస్ మహారాజ రవితేజ హీరోగా డైరెక్టర్ కార్తీక్
ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా 'ఈగల్'. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఓ ఈవెంట్ నిర్వహించారు చిత్రబృందం. ఈ క్రమంలో హీరో రవి తేజ మాట్లాడుతూ ‘ఈగల్ సినిమా చాలా బాగా వచ్చింది. నాకు నేను విపరీతంగా నచ్చిన గెటప్‌లో కనిపిస్తాను. ఆ గెటప్ రావడానికి 3 నెలలు పట్టింది. నేను అలాంటి మేకోవర్ చేయడం ఇదే తొలిసారి. ఇక ప్రేక్షకుల స్పందన కోసం చూస్తున్నా’అని తెలిపారు.