నేను ఫ్లైట్ నుంచి దూకలేదు: రమేశ్

74చూసినవారు
నేను ఫ్లైట్ నుంచి దూకలేదు: రమేశ్
విమాన ప్రమాదం నుంచి సజీవంగా బయటపడ్డ రమేశ్ విశ్వాస్ కుమార్ తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. “నేను ఫ్లైట్ నుంచి దూకలేదు. నేను కూర్చున్న భాగమే విడిపోయి మెడికోల హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్‌పై పడింది. ఎమర్జెన్సీ డోర్‌ నుంచి బయటకు రాగానే మంటలు చెలరేగాయి. శిథిలాల మధ్య నుంచి మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చాను. అనంతరం ఎవరో నన్ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు” అని తెలిపారు.

సంబంధిత పోస్ట్