రొమాంటిక్ సీన్స్, గ్లామర్ రోల్స్ నచ్చవు: ఇవానా

26031చూసినవారు
రొమాంటిక్ సీన్స్, గ్లామర్ రోల్స్ నచ్చవు: ఇవానా
గతేడాది 'లవ్ టుడే' సినిమాతో తెలుగువాళ్లను క్యూట్ లుక్స్‌తో పడేసి.. 'సింగిల్' మూవీతో తళుక్కుమని మెరిసిన కుర్ర బ్యూటీ ఇవానా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. '12 ఏళ్లకే చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చినా ఇండస్ట్రీలో కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాను. హైట్ తక్కువ అని విమర్శించినా ఆత్మస్థైర్యంతో ఇక్కడిదాకా వచ్చాను. రొమాంటిక్ సీన్స్, గ్లామర్ రోల్స్ నచ్చవు. ఎమోషనల్ సీన్స్ బాగా చేస్తా. యాక్షన్ చిత్రాలు చేయాలి' అని మనసులో మాట చెప్పుకొచ్చారు.