సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన భద్రత గురించి మాట్లాడారు. 'నాకు ఎప్పుడూ భద్రతపై నమ్మకం లేదు. ఈ దాడి జరిగిన తర్వాత సైఫ్‌కు సెక్యూరిటీ ఎందుకు లేదు? అని అందరూ అడిగారు. ఈ దాడిని ఒక పీడకలగా భావిస్తున్నా. ఇప్పుడు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని అనుకోవట్లేదు' అని పేర్కొన్నారు.