అంతా క్షణాల్లో జరిగిపోయింది.. ప్రమాదం జరిగిన వెంటనే లేచి పరిగెత్తానని అని విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన తరువాత లేచి చూడగా తన పక్కన అన్నీ మృతదేహాలే పడి ఉన్నాయని రమేష్ తెలిపారు. తనతో పాటు తన సోదరుడు కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నాడన్నారు. తన సోదరుడు ఎక్కడున్నాడో కనిపించలేదన్నారు. ప్రమాదం జరిగిన ఎయిర్ ఇండియా ఏఐ-171 ఫ్లైట్‌లో 11A సీటులో రమేష్ ప్రయాణించారు.