ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు: ప్రభాకర్‌రావు

52చూసినవారు
ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు: ప్రభాకర్‌రావు
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌ 23న ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. జూన్‌ 26న తాను భారత్‌కు రావాల్సి ఉందని, ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు చెప్పారు. వైద్యుల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్