ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో KTR రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు. ACB కౌంటర్‌కు సమాధానమిస్తూ.. 'ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో సంబంధం లేదు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతుల వ్యవహారం బాధ్యత సంబంధిత బ్యాంక్ దే.. చెల్లింపుల విషయంలో అన్ని అంశాలను HMDAనే చూసుకోవాలి. రూ. 10 కోట్లు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి కావాలని HMDA నిబంధనల్లో ఎక్కడా లేదు. నిధుల బదిలీతో మంత్రిగా నాకు సంబంధం లేదు' అని పేర్కొన్నారు.