పదవులు, అవార్డులను ఎప్పుడు ఆశించలేదు: బాలకృష్ణ(వీడియో)

64చూసినవారు
ఇటీవల కేంద్రం తెలుగు సినీయర్ హీరో బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం, మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కానీ పదవులు, అవార్డులను ఆశించి ఎప్పుడూ పని చేయలేదని పేర్కొన్నారు.