AP: తూ.గో. జిల్లా అంబాజీపేట మండలం సత్యవతి కాలనీకి చెందిన ఉందుర్తి నాగదుర్గ గతేడాది పనికోసం ఖతార్ వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో వంటపనికి చేరారు. అయితే ఆ ఇంటి యజమానులు చిత్రహింసలు పెడుతున్నారని తన భర్త ప్రశాంత్‌కు వీడియోలు, వాయిస్ మెసేజులు పంపారు. గ్రామ సర్పంచ్ సాయంతో ఎంపీ గంటి హరీష్ మధుర్, ఎమ్మెల్యే గిడ్జి సత్యనారాయణకు విషయం తెలియజేయగా.. ఆమెను స్వగ్రామానికి తీసుకొచ్చారు. తన బిడ్డలను చూస్తాననుకోలేదని నాగదుర్గ వాపోయారు.