అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ట్రంప్‌ను ఓడించగలదని తాను భావించినట్లు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. తాను ఎన్నికల బరిలో ఉంటే కచ్చితంగా ట్రంప్‌ను ఓడించేవాడినని, లేకపోవడంతో హారిస్‌కు మద్దతూ తెలిపినట్లు ఓ మీడియాతో పేర్కొన్నారు. మొదట అధ్యక్ష ఎన్నికల రేసులో నిలబడిన బైడన్ సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడం, ఆరోగ్య సమస్యల కారణంగా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. కాగా జనవరి 20న అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.