బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన కామెడీ టైంతో వివిధ టీవీ షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. అయితే బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు తన భర్తతో గొడవలు జరిగాయని, డిప్రెషన్‌కు కూడా గురైనట్లు చెప్పింది. గొడవల కారణంగా చనిపోవాలని కూడా అనుకుందట. కానీ ఎన్ని గొడవలు జరిగినా మేము కలిసే ఉన్నామని పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.