TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మంత్రుల శాఖలపై క్లారిటీ ఇచ్చారు. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానని స్పష్టం చేశారు. 'కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు. నేను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్‌లో ఎంట్రీ ఉండదు. తెలంగాణ, కర్ణాటకలో కుల గణన విజయవంతంపై చర్చించడానికే ఢిల్లీ వచ్చాను' అన్నారు. దీంతో పాత మంత్రుల శాఖల్లో మార్పులు లేనట్లు కనిపిస్తోంది.