భారత సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఆమె తనకు సొంత చెల్లి కంటే ఎక్కువని, సోఫియాకు పదిసార్లైనా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని తెెలిపారు. దేశం కోసం సోఫియా చేస్తున్న సేవలకు సెల్యూట్ చేస్తున్నట్లు మంత్రి విజయ్ షా స్పష్టం చేశారు.