స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమన్నారు. సర్వేలన్నీ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గెలిచి చూపిస్తానని, గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాననని ఘాటు వ్యాఖ్యలు చేశారు.