మంత్రి కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో దీనిపైన ఆమె స్పందించారు. వరంగల్‌లో తాను చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, గత ప్రభుత్వ మంత్రులు డబ్బులు తీసుకున్న విషయం అందరికీ తెలుసని అన్నారు. తన మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని, క్లిప్పులు చేసి ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. క్యాబినెట్‌లో గొడవలు సృష్టించే కుట్ర జరుగుతోందని, తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు.