‘నేను ఇంటికి రాను.. నన్ను మర్చిపో’.. భర్తకు మెసేజ్ పెట్టి..

50చూసినవారు
‘నేను ఇంటికి రాను.. నన్ను మర్చిపో’.. భర్తకు మెసేజ్ పెట్టి..
TG: భర్తకు మెసేజ్‌ పెట్టి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ సూరారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సాయిబాబానగర్‌ పాండుబస్తీలో రమేష్‌, మీనాక్షి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 16న సాయంత్రం ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లింది. రాత్రి 10.45 గంటలకు ‘నేను ఇంటికి రాను.. నన్ను మర్చిపో’ అంటూ ఆమె భర్తకు మెసేజ్‌ పంపింది. దీంతో రమేష్‌ తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్