హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో వివిధ విభాగాలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్స్ శిక్షణను పూర్తిచేశారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పరేడ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ రివ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరయ్యారు. పరేడ్‌లో పైలట్లు PC-7 MkII, హాక్, కిరణ్, చేతక్ వాహనాలతో విన్యాసాలు చేస్తుండగా, ఆకాశ్ గంగ, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.