ఐసీసీ డబ్ల్యూటీసీ 2023-25 ప్రైజ్‌మనీ ప్రకటించింది. విజేతతో సహా మొత్తం ఎనిమిది జట్లకు కలిపి WTC ప్రైజ్‌మనీని రూ.49.27 కోట్లుగా ఐసీసీ వెల్లడించింది. WTC ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.30.78 కోట్లు.. రన్నరప్‌గా నిలిచిన టీమ్‌కు 18.46 కోట్లుగా ఐసీసీ నిర్ణయించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లార్డ్స్‌లో జూన్ 11-16 వరకు జరగనుంది. తుది పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీపడనున్నాయి.