ప్రేమికులకు తెలంగాణ బజరంగ్ సేనా వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి 14 'వాలంటైన్స్ డే'ను తాము వ్యతిరేకిస్తున్నామన్నారని తెలిపారు. ప్రేమికుల దినోత్సవం రోజున ఎక్కడైనా జంటలు కనిపిస్తే వారిని తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లి వారి సమక్షంలో వివాహం జరిపిస్తామని తెలిపారు. శుక్రవారం పోలీసులు లాడ్జీలు, పబ్బులు, రెస్టారెంట్లపై ఓ కన్నేసి ఉంచేలా ఆదేశించాలని, రాత్రి 11 గంటల వరకు వాటిని మూసివేసేలా చూడాలని, మత్తు పదార్థాలు విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.