టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'దిల్‌రూబా' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంతో ఏదో ఒకటి పెద్దగా సాధించాలని ఉండేదని, రాయలసీమ కాబట్టి పాలిటిక్స్ మీద చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేదని చెప్పారు. సినిమాల్లోకి రాకపోయుంటే పాలిటిక్స్‌లోకి వెళ్లేవాడినని పేర్కొన్నారు.