TG: వేరే వారితో పెళ్లి చేస్తే యాసిడ్ పోసి, కత్తితో పొడిచి చంపేస్తానని బెదిరిస్తూ ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఖమ్మం(D) పెనుబల్లి(M) వీఎం బంజరకు చెందిన బొర్రా సాయిమహేందర్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఆదివారం మద్యం మత్తులో బాలిక చదువుతున్న ఇంటర్ కాలేజీకి వెళ్లి.. ఆమె పేరును చెబుతూ బయటకు రాకుంటే చంపేస్తానని బెదిరిస్తూ చేతులు కోసుకున్నాడు. సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లి మరలా బెదిరించాడు. దీంతో వారు భయపడ్డారు.