తెలంగాణలో బస్ పాస్ ఛార్జీల పెంపుపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం టోల్ ఛార్జీల నుంచి తెలంగాణ RTCకి మినహాయింపు ఇస్తే పెరిగిన బస్ ఛార్జీలను తగ్గిస్తామని అన్నారు. కొన్నేళ్లుగా బస్ పాస్ ఛార్జీల పెంపు లేదని, ఈ నిర్ణయంతో ప్రజలపై ఎటువంటి భారం ఉండదని మంత్రి చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాక రూ.6 వేల కోట్లు RTCకి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.