TG: ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ నాయకత్వంలో కదులుతామని BRS నేత, మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. "కేసీఆర్ ఆదేశాలతోనే ప్రెస్‌మీట్ పెట్టాం. ఆయనే నాయకత్వం వహిస్తానని చెప్పారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తే మంచిది. మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయకుంటే రైతులతో కదులుతాం. వారి ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాడతాం. రాష్ట్ర, రైతుల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని కేసీఆర్ చెప్పారు." అని హరీశ్ తెలిపారు.