TG: *పోలవరంలో డయాఫ్రంవాల్ కొట్టుకుపోతే అక్కడికి NDSA ఎందుకు పోలేదు? ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలిపోతే ఎందుకు రాలేదు?’ అని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మేడిగడ్డ నుంచి 73,600 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నీటిని తీసుకునే అవకాశం ఉన్నా, ఎందుకు తీసుకోవట్లేదు’ అని ప్రశ్నించారు.