మహారాష్ట్రలో అప్పుడు జట్టు ఊడితే.. ఇప్పుడు గోళ్లు!

83చూసినవారు
మహారాష్ట్రలో అప్పుడు జట్టు ఊడితే.. ఇప్పుడు గోళ్లు!
మహారాష్ట్రలోని బుల్ఢాణా జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు తాజాగా గోళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఇటీవల చాలా మంది జుట్టు కోల్పోయిన ఘటనపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా, ఇప్పుడు అదే ప్రాంతాల్లో గోళ్లు విరిగిపోవడం, నలుపు పడటం వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తమ సమస్యలకు చెక్‌ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్