TG: ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో తనపై కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ‘ఈ ప్రభుత్వానికి దమ్ముంటే దయచేసి ఫార్ములా-ఈ కార్ రేసుపై శాసనసభలో చర్చ పెట్టండి. సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యానించారు.